Ramagundam | జ్యోతినగర్(రామగుండం), జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినంను పురస్కరించుకోని శుక్రవారం ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీపీసీ సాయి సేవాసమితిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జన్మదిన కేక్ కట్ చేసిన నాయకులు సాయి సేవాసమితి పాఠశాల విద్యార్థులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సాయంత్రం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
అలాగే రామగుండంలోని తబితా ఆశ్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన కేక్‌కట్ చేసి ఆశ్రమం పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వొల్లాల మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ వీరాలాల్, నాయకులు ఈదునూరి పర్వతాలు, ధరిణి పోశం, మెట్టుపల్లి అనిల్‌రావు, లంబు జగన్‌రెడ్డి, కంది సతీశ్, దుర్గాప్రసాద్, మేడి మహేశ్, కిషోర్, జనగామ శంకర్, వొల్లాల కమలాకర్, రాజారాం, శేఖర్, వేణు, కరుణాకర్, శాంతా, సరోజన, కందుల సత్తయ్య, మాడిశెట్టి రవి, కరివేద శ్రీనివాస్లెడ్డి, గౌస్పష, నరేవ్, శంకర్, ఖలీల్, మహమ్మద్ పాష, అర్జున్, శివకుమార్, జస్వంత్, శ్రీనివాస్, కోమల తదితరులు పాల్గొన్నారు.