KTR Birthday | ధర్మారం, జూలై24: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. అనంతరం కరీంనగర్- రాయపట్నం ప్రధాన రహదారి పక్కన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, డైరెక్టర్ భారత స్వామి, నాయకులు పూస్కురు జితేందర్ రావు, పూస్కురు రామారావు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, పాకాల రాజయ్య, తుమ్మల రాంబాబు, ఎండీ రఫీ, దాడి సదయ్య, మోతే కనకయ్య, ఎగ్గేలా స్వామి, కాంపెల్లి చంద్రశేఖర్, దేవి రమణ, దేవి నలినీకాంత్, పాక వెంకటేశం, నాడెం శ్రీనివాస్, సల్వాజీ మాధవరావు, బండి సురేష్ ,గాజుల రాజు, దేవి రాజేందర్, ఠాకూర్ హనుమాన్ సింగ్, కీసర స్వామి, దాసరి స్వామి, సంధినేని కొమురయ్య, అజ్మీర మల్లేశం, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, ముదాం శ్రావణ్ కుమార్, రాగుల చిన్న మల్లేశం, కడారి లాలయ్య, అజ్మీర తిరుపతి నాయక్, అజ్మీర శ్రీనివాస్ నాయక్, బొలిశెట్టి సుధాకర్, బొడ్డు రమేష్, అల్వాల సంతోష్, కాంపల్లి అపర్ణ, మర్రి మమత, విజయలక్ష్మి, దురిశెట్టి స్వరూప తదితరులు పాల్గొన్నారు.