రాజన్న సిరిసిల్ల, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరి 11 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్కు చేరుకుంటారు.
సాయంత్రం వరకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.