KTR | సిరిసిల్ల రూరల్, మే 11: ‘మహేష్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండూ… మనోళ్లు సౌదిలో ఉన్నరు.. నీదగ్గరు వస్తరు.. నాలుగు రోజుల్లోనే మండెపల్లికీ తీసుకువస్తా’ అని సౌదిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో అచేతనలో ఉన్న మహేష్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని మహేష్ కుటుంబసభ్యులను ఆదివారం కలిసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి సమక్షంలో సౌదిలో దవాఖానాలో ఉన్న మహేష్ విడియో కాల్ మాట్లాడారు.
మహేష్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండాలని సూచించారు. దవాఖానా వివరాలు పంపించాలని కోరారు. సౌదిలో మన టీం సభ్యులు వస్తారని, నిన్ను మండెపల్లికీ తీసుకువస్తారని ధైర్యంగా చెప్పారు. ఆధైర్యపడవద్దని, తాను ఉన్నానని ఆన్ని చూసుకుంటానని పేర్కొన్నారు. సౌదిలో దవాఖానాలో డిశ్చార్జి చేయించి, సొంత ఖర్చులతో అక్కడి నుంచి హైదరబాద్ ఎయిర్‌పోర్టుకు రాగానే, ఎయిర్పోర్ట్ నుంచి మండెపల్లి వరకు తీసుకువచ్చేలా చూస్తానని మహేషుకు వివరించారు. ఆయన వెంట డాక్టర్ నక్క రవి, రాగిపెల్లి కిష్టారెడ్డి, బండి భాస్కర్, పెద్ది వెంకటేష్, నేవూరి రాం, ప్రశాంత్, పర్శరాములు, నేవూరి నవీన్‌రెడ్డి, తదితర నేతలు ఉన్నారు.