రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చేరుకుంటారు.
ముందుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు ఏర్పాటు చేస్తున్న బిక్ష కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గంభీరావుపేటలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5గంటలకు కోనరావుపేట మండలం మల్కపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.