KTR Sena |సిరిసిల్ల రూరల్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగి రి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకలకు మనోహర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు. కేటీఆర్కు అనుకూలంగా నినాదాలు చేశారు. పద్మనగర్ లోని సంతోషి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృద్ధాశ్రమం లో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. అక్కడే మొక్కలు నాటారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్, విజయ్, ఉమాశంకర్, శివకృష్ణ, బండి ప్రశాంత్ గౌడ్ తదితర నాయకులు ఉన్నారు.