Korutla | కోరుట్ల, ఏప్రిల్ 3 : ఆస్తి పన్ను వసూళ్లలో కోరుట్ల మున్సిపాలిటీ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించి డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పన్ను వసూళ్ల వివరాలు ఆన్లైన్లో వెల్లడించగా 89.82 శాతం ఆస్తి పన్నులు వసూలు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో టాప్ 6లో నిలిచింది. పట్టణంలో మొత్తం 19201 నివాస గృహలు, వ్యాపార సముదాయాలు ఉండగా వాటి ద్వారా రావాల్సిన పన్నులు రూ.5 కోట్ల 5 లక్షల 97 వేలు ఉన్నాయి. వీటిలో రూ. 4 కోట్ల 55 లక్షల 4 వేలు ఆస్తి పన్ను వసూలు చేశారు. మొత్తంగా 89.82 శాతం పన్ను వసూలు చేసిన మున్సిపాలిటీగా కోరుట్ల ఘనత సాధించింది.
ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచిన కోరుట్ల బల్దియాకు పురస్కారం దక్కింది. గురువారం ఎంసీహెచ్ఐర్డీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీగా నిలిచిన బల్దియాకు అవార్డు, ప్రశాంస పత్రాన్ని సీడీఎంఏ శ్రీ దేవి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అందుకున్నారు.