యూరియా అందుబాటులో ఉంచాలి
ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా, డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల కొరత లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
- డీఏపీ ఎరువులు కూడా తెప్పించాలి
- రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
- జగిత్యాల కలెక్టర్‌కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వినతి
మెట్పల్లి/కోరుట్ల, జూన్ 9: ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా, డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల కొరత లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు అవసరమైన సమయంలో నాణ్యమైన ఎరువులు అందితేనే పంటల సాగు సజావుగా సాగుతుందని చెప్పారు.
ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట అదనపు నిల్వలను ఉంచాలని, జిల్లాలోని సహకార సంఘాలు, ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉండేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హమీ ఇచ్చారని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, జీవన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లయ్య తదితరులున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

