MIM | కోరుట్ల, సెప్టెంబర్ 7. పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు ఎంఐఎం అధినేత సలావోద్దీన్ ఓవైసీని కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైద్రాబాద్ దారుసలేంలోని ఎంఐఎం కార్యాలయంలో పార్టీ అధినేతను కలిసిన నాయకులు కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, వైద్య పరికరాలు అందుబాటులో లేక రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని విన్నవించారు.
స్పందించిన ఓవైసీ కోరుట్ల ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు నాయకులు తెలిపారు. త్వరలోనే ఆసుపత్రిలో సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హమీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ పట్టణాధ్యక్షుడు మహ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి వాజిద్ తదితరులున్నారు.