Korukanti Chander | కేటీఆర్ జన్మదినం సందర్భంగా దుర్గామాతకు పూజలు చేసి మొక్కలు పంపిణీ చేసిన కోరుకంటి చందర్
వర్ధిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు.. అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్లోని శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు చేశారు.
Korukanti Chander | కోల్ సిటీ, జులై 24 : వర్ధిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు.. అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్లోని శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం ఆ పార్టీ నాయకుడు కోడి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోరు కంటి చందర్ మాట్లాడుతూ అతడే ఒక చరిత్ర, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కొండంత అండ కేటీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండున్నర ఏండ్లుగా సాగుతున్న అరాచక పాలనకు ప్రజలు విసుగు చెందారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా భక్తులు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.
విలువైన పండ్ల మొక్కలు పంపిణీ చేసినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, మూల విజయ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, కార్పొరేటర్లు తోకల శ్యామణి రమేష్, కర్క పద్మజ, నాయకులు నీరటి శ్రీనివాస్, మురళీధర్ రావు, మారుతి, కృష్ణవేణి, గుర్రం పద్మ, దొమ్మటి వాసు తోపాటు మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

