జగిత్యాల, సెప్టెంబర్ 5: యూరి యా కోసం రైతులు పడుతున్న బాధలు, గోసలు ప్ర భుత్వానికి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించా రు. యూరియా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా యుద్ధప్రాతిపదికన కేంద్రం నుంచి యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. కొరత తీర్చడంలో రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు బాధ్యత లేదా..? అని నిలదీశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కోసం రైతుల బాధలు వర్ణనాతీతం గా ఉన్నాయని, ఎక్కడ చూసినా రో జుల కొద్దీ తిరుగుతున్నారని ఆవేదన చెందారు. ఇటీవలి భారీ వర్షాలకు వరి ఏపుగా పెరిగిందని, ఈ సమయంలో యూ రియా లేకపోవడంతోనే రాష్ట్ర వ్యా ప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తున్నారని చెప్పా రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఇ బ్బందీ లేకుండా ఎరువులు అందించామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు బీజేపీ, కాం గ్రెస్ రైతులను అధోగతి పాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన జనంలోకి వస్తే రైతుల ఇబ్బందులు కనిపిస్తాయ ని సూచించారు. రాష్ట్రంలో 8లక్షల 32వేల మెట్రిక్ టన్నుల యూరి యా అవసరమైతే 5 లక్షల మెట్రిక్ టన్నులే కేటాయించారని, ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నులు అవసరము న్నా సీఎం, మంత్రులు నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో పడ్డ కష్టాల ను గుర్తుకు తెచ్చారన్నారు.
ఎరువు ల కొరత విషయంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే స్థానిక ఎన్నికల విషయంలో కాలయాపన చేస్తున్నారన్నారు. అనంతరం కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీ ఎం రేవంత్ ప్రజా సమస్యలు వదిలేసి, ఎంతసేపూ కేసీఆర్‌ను తిట్టడ మే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సొంతడబ్బా, విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఆ తర్వా త జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అతి పె ద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారని, రాష్ర్టాన్ని సస్యశ్యామ లం చేశారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు, కవితను ఆడబిడ్డగా గౌరవిస్తామని, కాళేశ్వరం విషయంలో హరీశ్‌రావుపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని కొప్పుల చెప్పారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను విద్యాసాగర్ రావు ఖండించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, సమిండ్ల వాణి శ్రీనివాస్, అవారి శివాకేసరి బాబు, పీఎసీఎస్ అధ్యక్షుడు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, జగిత్యాల రూరల్, అర్బన్ అధ్యక్షులు అయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, నీలి ప్రతాప్, కోటగిరి మోహన్, దావ సురేశ్, జవ్వాజి ఆదిరెడ్డి, హరీశ్ కల్లూరి, చందా సాయి తదితరులు పాల్గొన్నారు.