Konduri Ravinder Rao | వేములవాడ, డిసెంబర్ 27: కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (అపెక్స్ బ్యాంక్) అధ్యక్షుడుగా పదవీ విరమణ చేసిన కొండూరి రవీందర్ రావును వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఘనంగా సన్మానించారు.
శనివారం కరీంనగర్ లో నిర్వహించిన పదవీ విరమణ సభలో పాల్గొన్న చల్మెడ లక్ష్మీనరసింహారావు కొండూరు రవీందర్రావు గత రెండు దశాబ్ధాల కాలంగా సహకార రంగానికి చేసిన సేవలను కొనియాడారు.