జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు ఆలయానికి ( Kondagattu temple) హుండీ లెక్కింపు ద్వారా రూ. కోటి 79 లక్షల 35,866 ఆదాయం( Income) వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. 84 రోజులకు సంబంధించి ఆలయంలోని 13 హుండీల లెక్కింపు జరుపగా ఈ ఆదాయం వచ్చిందన్నారు. మిశ్రమ వెండి, బంగారం సీల్ చేసి హుండీలో భద్రపరిచామని వివరించారు. 130 విదేశి కరెన్సీ వచ్చాయని తెలిపారు.
జగిత్యాల దేవాదాయ శాఖ పరిశీలకులు రాజమోగిలి పర్యవేక్షణలో ఆలయ ఏఈవో గుండి హరిహరనాథ్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ సిబ్బంది, ఏఎస్సై, పోలీసు, సెక్యూరిటీ , బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కింపు జరిగిందని కార్యనిర్వహణాధికారి కాంతారావు వెల్లడించారు.