మల్యాల, జనవరి 27: సమ్మక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం కొండగట్టు హనుమాన్ ఆలయం భక్తులతో పోటెత్తింది. సుమారు 25 మంది తరలిరావడంతో ఎటుచూసినా రద్దీ కనిపించింది. కొండపైకి చేరుకొనేందుకు 3 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
వివిధ ఆర్జీత సేవల ద్వారా సుమారు 10 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆలయ ఈవో టీ వెంకటేశం. పాలక మండలి చైర్మెన్ తిరుక్కోవళూర్ మారుతీస్వామీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా తాగునీటి సౌకర్యంలేక క్యూలైన్లలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.