Appointed | చిగురుమామిడి, సెప్టెంబర్ 21: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా కొలిపాక వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ గా ఉన్న దుడ్డేల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా, అతని స్థానంలో నూతన చైర్మన్ గా ఆదివారం పాలకవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ వేణును పాలకవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సలహాదారుడు చాడ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసాని సతీష్, కోశాధికారి అరిగేల రమేష్, సభ్యులు మామిడి అంజయ్య, పరకాల కొండయ్య, చాడ అనిల్ రెడ్డి, తాటికొండ సందీప్ రెడ్డి, పంకెర్ల రాజు, అన్న సదానందం, తంగళ్ళపల్లి అంజయ్య, బోయిని సంజీవ్, గాదపాక రవీందర్, బిల్ల తిరుపతిరెడ్డి,నెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన గౌరవాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కి పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.