Kolanur Railway Gate | ఓదెల, ఏప్రిల్ 7: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలోని ఎల్ సి 34 రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా మరో వారం రోజులు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు మూసి వేస్తున్నట్లు మొదట తెలిపిన రైల్వే అధికారులు తిరిగి ఈ నెల 8 నుంచి 14వరకు మూసివేతను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.
వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రవాణా కొనసాగించాలని తెలిపారు. కాగా కాల్వ శ్రీరాంపూర్-సుల్తానాబాద్ ప్రధాన రహదారిలో రైల్వే గేటు మూసివేత వల్ల అనేక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా రెండు వారాలు గేటు మూసివేత వలన ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు గేటు మూసివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.