London | కోరుట్ల, ఏప్రిల్ 28: తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, యూకే బీఆర్ఎస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. యూకే లోని లండన్ లో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు పార్టీ గులాబీ జెండాను వారు ఆవిష్కరించారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు తెలంగాణ ఎన్నారైలు బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ మేరకు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు.
అనంతరం యూకే బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన కెసిఆర్ తోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలని తెలిపారు. 26 సంవత్సరాల గులాబీ పండగ వేళ అన్ని సందర్భాల్లో పార్టీ వెంట ఉన్న ప్రతీ కార్యకర్త కు లండన్ లో మమ్మల్ని ప్రోత్సహించి నడిపించిన ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంకు ఎన్నారైలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసే వరకు అలుపెరగకుండా పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు.
రాబోయే తరాలకు బీఆర్ఎస్ పార్టీ చరిత్రను, కేసీఆర్ పోరాటాన్ని తెలియజేసేలా కృషి చేస్తామని, యువతరమంతా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని ఎన్నారై నాయకులు తెలిపారు. పార్టీ నీ బలోపేతం చేసేందుకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలిచింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, బీఆర్ఎస్ పార్టీని కెసిఆర్ నాయకత్వాన్ని నమ్మిన ప్రజలకు మేలే జరిగిందన్నారు. మనమంతా కేసీఆర్ వెంటే ఉండాలని, ఎన్నారైలంతా కేసీఆర్ కు అండగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూకే ఎన్నారై బీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి నవీన్ మాదిరెడ్డి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ రమేష్ ఎసెంపల్లి, కార్యదర్శి సురేష్ గోపతి, అబ్దుల్ జాఫర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ కటికనేని, అబ్దుల్ కుదూస్, తదితరులు పాల్గొన్నారు.