KORUKANTI CHANDAR | గోదావరిఖని: తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకుని కపాడింది తొలి సీఎం కేసీఆర్ మాత్రమేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ 25 అవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుండి 50 డివిజన్ల నుంచి 50 బస్సులు ఇతర వాహనాలు ద్వారా వేలాది మంది ప్రజలు, సింగరేణి కార్మికులు, గులాబీ శ్రేణులు ఎల్కతుర్తికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వివిధ చోట్ల గులాబీ జెండాలను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా మాత్రమేనన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పండగ వాతావరణంలో కుంభమేళా తరహలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రామగుండం నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది ఈ సభకు తరలి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి నెంబర్ వన్ గా నిలిచిందని, ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
కేసీఆర్ గారి పాలనలో అనేక సంక్షేమ పథకాలు
వృద్ధులకు 2000 పెన్షన్ కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు, కాలేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట వ్యవసాయ రంగాన్ని సస్యశామలం చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. రైతులకు 24 గంటలు ఉచితంగా కరంటు, సాగునీరు, సకాలంలో ఎరువులు పెట్టుబడి సహాయం అందించిన మనసున్న మారాజు కేసీఆర్ మాత్రమేనని అన్నారు.
పదేళ్ల ప్రగతి ప్రస్థానం వెనక్కి పోయిందని తెలంగాణ ప్రజలు దిగాలు పడుతున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని తెలంగాణ ప్రజలంతా కోరుతున్నట్టు ఆయన తెలిపారు. నాయకులు పి.టి.స్వామి, కౌశిక హరి, పెంట రాజేష్, పాముకుంట్ల భాస్కర్, చెలకలపల్లి శ్రీనివాస్, మేతుకు దేవరాజ్, నూనే శరత్ కుమార్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ బచ్చాల రాములు, ఆవునూరి వెంకటేష్, కర్రీ ఓదెలు తదితరులు పాల్గొన్నారు.