Dasari Manohar Reddy | ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసిఆర్ అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కొనియాడారు.
Dasari Manohar Reddy | పెద్దపల్లి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి కమాన్: ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసిఆర్ అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ జాతిపిత, ఉద్యమ’ప్రగతి రథసారధి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, తెలంగాణ భవన్ లో మంగళవారం వేరువేరుగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసిఆర్ అని, ఇలాంటి నాయకుడు ప్రజల ఆశీస్సులతో దేవుని దయతో నిండు నూరేళ్లు జీవించి, తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీష్ గౌడ్, కౌన్సిలర్ వెన్నం రవీందర్-సుజాత, సలేంద్ర రాముల యాదవ్, మోబిన్, ఖదీర్ ఖాన్, కార్తీక్, మండల పార్టీ నాయకులు బాల్సాని ఈశ్వర్ గౌడ్, తీగల సదయ్య, ముత్యాల రాజయ్య, సుంచు సది, జై, రామ్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, కాశిపాక వాసు, కానీ నరేష్, పల్లె మధు, ఖాదర్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, బాలసాని నరేష్, ముత్యం లక్ష్మణ్, ధర్మపురి, ప్రేమ్ సాగర్, కిట్టు యాదవ్ తో పాటుగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

