చిగురుమామిడి/ చొప్పదండి/ గంగాధర/ హుజూరాబాద్‌టౌన్/ సైదాపూర్, ఏప్రిల్ 5: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ పొలంబాటలో భాగంగా జిల్లాలోని ముగ్దుంపూర్‌లో ఎండిన పంటల పరిశీలనకు వచ్చిన ఆయనకు అడుగడుగునా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.
కోహెడ మండలం శనిగరం స్టేజీ వద్ద స్వాగతం పలికేందుకు పార్టీ చిగురుమామిడి మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పిలుపు మేరకు తరలివచ్చినట్లు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.
ఇంఅధినేతకు ఘన స్వాగతంరయ్య, మండల నాయకులు ఆకవరం శివప్రసాద్, బెజ్జంకి లక్ష్మణ్, పెనుకుల తిరుపతి, సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, కత్తుల రమేశ్, ఎస్కే సిరాజ్, తోడేటి శ్రీనివాస్, దేశిని రాజయ్య, గడ్డం అనిల్ వివిధ గ్రామాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులున్నారు. ముగ్దుంపూర్‌లో ఎండిన పంటల పరిశీలన అనంతరం జగిత్యాల రహదారి మీదుగా సిరిసిల్లకు బయలుదేరిన కేసీఆర్‌కు మార్గమధ్యంలో చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, రైతులు ఘన స్వాగతం పలికారు.
రామడుగు మండలం వెదిర వద్ద, గంగాధర మండలం కురిక్యాల వద్ద రైతులు ఎండిన పంటలను తెచ్చి చూపించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లికి వెళ్తున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వారిని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభినందించారు. కేసీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు సైదాపూర్ మండలం నుంచి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్‌రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.
చిగురుమామిడి, ఏప్రిల్ 5: బొమ్మనపల్లి వాసి కత్తుల ప్రశాంత్ యాదవ్ తన చేతిపై కేసీఆర్ ముఖచిత్రాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుని అభిమానాన్ని చాటాడు. శుక్రవారం ఆయనను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ జిల్లా పర్యటనలో ఉన్న కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లగా, ప్రశాంత్ చేతిపై వేయించుకున్న పచ్చబొట్టును చూసి అభినందించారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించిన ప్రశాంత్, ప్రస్తుతం బీఆర్ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక్కడ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, గ్రామాధ్యక్షుడు కత్తుల రమేశ్ తదితరులు ఉన్నారు.