Sultanabad | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 16 : ఘనంగా కార్తిక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన పురాతన దేవాలయం శ్రీ రంగనాయక స్వామి దేవాలయ ఆవరణలో కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ మహిళలు అందరూ కూడా ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వలన తమ కోరికలు నెరవేరుతున్న విశ్వాసంతో పెద్ద ఎత్తున దీపారాధన చేశారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన బ్రాహ్మణులు విష్ణు శివ ఆరాధన తో ఈ ప్రాంగణం మారుమోగింది.. బ్రాహ్మణోత్తములచే విష్ణు శివులకు అభిషేకం, విష్ణు సహస్రనామాల లలిత సహస్రనామాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. కరీంనగర్ నుంచి దాదాపు 300 మంది బ్రాహ్మణులు తరలి వచ్చి రంగనాయక స్వామి దేవాలయాన్ని దర్శించడమే కాకుండా ఈ ఆలయానికి వచ్చి పునీతులము అయినమని భక్తులు ఎంతో ఆనందం అన్నారు.
.కరీంనగర్ చుట్టూ ప్రాంతాల వారే కాకుండా సుల్తానాబాద్ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు . తోగుట రంగంపేట పీఠాధితులు శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామివారి శిష్య బృందం చే భక్తి గీతాలతో ప్రాంగణం మారుమూల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ సభ్యులు అందరు పాల్గొని వన సమారాధ కార్యక్రమంలో అన్నదానం నిర్వహించారు.