Doctorate | తిమ్మాపూర్, డిసెంబర్5: తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో గల వాగేశ్వరి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ డాక్టరేట్ పొందారు.
‘డిసైన్ అండ్ ఎనాలిసిస్ అఫ్ సేఫ్టీ అసిస్టెన్స్ టు రెడ్యూస్ కాసాలిటీ ఎట్ కన్స్ట్రక్షన్ సైట్ యుసింగ్ మెషిన్ లెర్నింగ్’ అనే అంశంపై ప్రొఫెసర్లు అజయ్ రాయ్, అనిత గెహ్లాట్, రాజేష్ సింగ్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందించారు. ఆయనను కళాశాల జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.