కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు జలాశయం వివిధ వర్ణాల్లో నిత్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డ్యాం గేట్ల పై భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బులు జలాశయానికి కొత్త అందాలను తెచ్చి పెడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వేకువజామున లైట్ల వెలుగుల్లో నింగి నేల నీలి వర్ణంలో దర్శనమివ్వగా ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది.
– కరీంనగర్ స్టాఫ్ఫొటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ