హుజూరాబాద్ టౌన్, జూన్ 15: మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగాయి. ఇందులో భాగంగా మురుగు కాలువల్లో సిల్ట్ తొలగింపు, రోడ్లపై నీరు నిల్వకుండా గుంతల పూడ్చివేత, మురుగు నీటి గుంతల్లో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయడం తదితర పనులు చేపట్టారు. వాటిని మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ చీమ వెంకన్న, పురపాలక అధికారులు, కౌన్సిలర్లు పర్యవేక్షించారు.
7వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడామైదానాన్ని పరిశీలించారు. వానకాలం దృష్ట్యా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్పర్సన్ నిర్మల సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ జీ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారులు జ్యోత్స్న, అశ్వినిగాంధీ, శానిటరీ ఇన్స్పెక్టర్ పీ అనిల్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ కిషన్‌రావు, కౌన్సిలర్లు, వార్డు ప్రత్యేకాధికారులు, మెప్మా, అంగన్వాడీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండలంలో..
ఇల్లందకుంట, జూన్ 15: మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులతో పాటు జంగిల్ కటింగ్ పనులు చేపట్టారు. వాగొడ్డురామన్నపల్లి గ్రామంలో పనులను సర్పంచ్ రాజు, గ్రామ ప్రత్యేకాధికారి సంపత్ పర్యవేక్షించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు రాజేశ్వరి, వెంకటేశ్వర్లు, పంచాయితీ కార్యదర్శులు కిషన్, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్వప్న, సంధ్యారాణి, అంకూస్, రాజేశ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
జమ్మికుంట రూరల్, జూన్ 15: పట్టణ ప్రగతి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ చైర్పర్సన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు సూచించారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లతో పట్టణ ప్రగతి, మన ఊరు-మనబడి కార్యక్రమాలపై కమిషనర్ సమ్మయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ హాజరై పనుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఇక్కడ మున్సిపల్ అధికారులు, ఆర్పీలు,అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.