పెగడపల్లి, నవంబర్ 14: సమాజ సేవలో అందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు తన తండ్రి కాసుగంటి లక్ష్మీనర్సింహారావు జ్ఞాపకార్థం రూ.10 లక్షలతో కొనుగోలు చేసిన వైకుంఠరథాన్ని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి మంత్రి ప్రారంభించి నంచర్లకు చెందిన శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, ఆపత్కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సేవ చేయడం విషయమన్నారు. జడ్పీటీసీ రాజేందర్రావు వైకుంఠరథాన్ని కొనుగోలు చేసి మండలానికి అందించడం అభినందనీయమని, అలాగే శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు మరువలేనివని, ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా నంచర్లకు చెందిన ముదుగంటి శ్రీధర్‌రెడ్డి ట్రస్ట్ కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష ఆర్థికసాయం అందించగా, కీచులాటపల్లికి చెందిన గర్షకుర్తి రాజు అనే దివ్యాంగుడికి మంత్రి రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. కరోనా కాలంలో అందించిన సేవలకు గానూ వైద్యారోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులను మంత్రి, జడ్పీ చైర్పర్సన్ సన్మానించారు. కార్యక్రమంలోఎంపీపీ గోళి శోభ-సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, సర్పంచ్ మేరుగు శ్రీనివాస్, ఎంపీటీసీ బొమ్మెన జమున-స్వామి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, విండో చైర్మన్లు కర్ర భాస్కర్‌రెడ్డి, మంత్రి వేణుగోపాల్, ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నగావత్ తిరుపతినాయక్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య, మండల వైద్యాధికారి సుధాకర్, ట్రస్ట్ చైర్మన్ పెంట శ్రీనివాస్, సభ్యులు చేపూరి మల్లేశం, లింగంపల్లి లచ్చయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.