గంగాధర, మే 24: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు హెచ్చరించారు. మండలంలోని మధురానగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఉప్పరమల్యాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై నిరాధార ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రవిశంకర్ మూడున్నరేళ్లలో నాలుగు అంతస్తుల మేడ ఎలా కట్టారని వివరాలు తెలియకుండా మాట్లాడారని మండిపడ్డారు.
బ్యాంక్ లోన్ తీసుకొని తన స్వగ్రామం బూరుగుపల్లిలో ఇల్లు నిర్మించుకొని, నెలనెలా ఈఎంఐ చెల్లిస్తున్న విషయాన్ని జీవన్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తన తండ్రి కట్టిన ఇల్లు తప్ప మరొకటి లేదని చెప్పిన జీవన్‌రెడ్డికి బెంగళూరు, హైదరాబాద్, కొండగట్టు జేఎన్టీయూ వద్ద ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌పై ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు వేముల దామోదర్, నాయకులు వేముల అంజి, రామిడి సురేందర్, ఆకుల మధుసూదన్, ముద్దం నగేశ్, దోమకొండ మల్లయ్య, సముద్రాల అజయ్, సుంకె అనిల్, పెంచాల చందు, మ్యాక వినోద్, గంగాధర కుమార్, మామిడిపల్లి అఖిల్, సముద్రాల ఓంకార్, గంగాధర వేణు పాల్గొన్నారు.