న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించేందుకు విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన మార్చి 9న చర్చ, ఓటింగ్ ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆదివారం తెలిపారు.
నిబంధనల ప్రకారం సమావేశాల తొలి రోజే ఈ చర్చ చేపట్టాలని చెప్పారు. ఓం బిర్లా స్పష్టంగా విపక్షాలపై పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని విపక్షం ఆరోపించి ఆయనపై అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడంతో చర్చ అనివార్యమైంది. కాగా, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు బడ్జెట్ మలి విడత సమావేశాలు ఉంటాయని కిరణ్ రిజుజు తెలిపారు.