కార్పొరేషన్, మార్చి 12: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని 49వ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, నాయకులు సొహాన్సింగ్, డీఈ, ఏఈ, ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్‌కు మంచినీటి సరఫరా అందిస్తున్న రా వాటర్ పైపులైన్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. మానేరు డ్యాం గేట్ల వద్ద ఉన్న బూస్టర్లను ఆయన పరిశీలించారు. గత వానకాలంలో రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని వదలడంతో నీటి తాకిడికి 800 ఎంఎం డయా రా వాటర్ పైపులైన్ ధ్వంస్వం కాగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల క్రితమే పైపులైన్ మరమ్మతుల కోసం నిధులు కేటాయించి టెండర్లు నిర్వహించి పనులు చేపడుతున్నామన్నారు. బల్దియా ఫిల్టర్ బెడ్‌కు వచ్చే 800 ఎంఎం, 600 ఎంఎం డయా గల రెండు రా వాటర్ తీసుకునే పైపులైన్ ఉన్నాయన్నారు. పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో బల్దియా ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.