మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్చల్
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన ఘటన వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మట్టెవాడ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలరాజు వ్యక్తిగత పనులపై వరంగల్‌కు వచ్చాడు.
- కేసు నమోదు చేసిన మట్టెవాడ పోలీసులు
వరంగల్‌చౌరస్తా, ఫిబ్రవరి 20: శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన ఘటన వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మట్టెవాడ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలరాజు వ్యక్తిగత పనులపై వరంగల్‌కు వచ్చాడు.
గురువారం అర్ధరాత్రి సమయంలో తమ కారుకు సీఎన్జీ గ్యాస్ ఫిల్లింగ్ కోసం వరంగల్ సెంట్రల్ జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుకు వెళ్లాడు. కారులో త్వరగా గ్యాస్ ఫిల్ చేయాలంటూ పెట్రోల్ పంపు సిబ్బందిని దూషించాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న జైలు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో జైలు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మట్టెవాడ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది అక్కడికి చేరుకొని, నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా, బాలరాజు పోలీస్ సిబ్బందిని సైతం దూషిస్తూ, విధుల్లోఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు.
దీంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే మట్టెవాడ ఎస్సై శివకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని బాలరాజును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో సైతం బాలరాజు ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శుక్రవారం పెట్రోల్ పంపు నిర్వహణాధికారి, సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ ఉద్యోగి మద్యంమత్తులో వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

