జమ్మికుంట రూరల్, మార్చి 7: మహిళా సాధికారకతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎంఏ మహిళా విభాగం, వాసవి వనితా క్లబ్ అధ్వర్యంలో వోమెగా దవఖాన సహకారంతో జమ్మికుంటలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ అవగాహన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే మహిళల అభ్యున్నతి సాధ్యమ న్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. మహిళలు ఆనారోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండి డాక్టర్ సలహాల మేరకు చికిత్స చేయించుకోవాలని సూచించా రు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్‌ను వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఐఎంఏ మహిళా వైద్యులు శాలువాలతో సన్మా నించారు. కార్యక్రమంలో ఐఎంఏ మ హిళా విభాగం చైర్మన్ డాక్టర్ శ్రీవాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న, వాసవి క్లబ్ అధ్యక్షుడు గంప సురేందర్, ఐఎంఏ సభ్యులు డాక్టర్ లావణ్య, డాక్టర్రాణి, డాక్టర్ పద్మజ, డాక్టర్ మౌనిక, డాక్టర్ అనిత కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌టౌన్, మార్చి 7: కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ ఏరియా దవాఖానలో ఇద్దరు మహిళలకు జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ సోమవారం కేసీఆర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే అతివలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమం లో ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ ఏ రాజేందర్‌రెడ్డి, వైద్యుడు పీ శ్రీకాంత్‌రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.