అంతర్గాం, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరినది, చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లల పెంపకంతో మత్స్యసంపద పుష్కలంగా అభివృద్ధి చెందిందన్నారు. గోదావరినదిని నమ్ముకుని జీవిస్తున్న వారికి జీవనాధారంగా మారిందన్నారు. సమీకృత మత్స్యసంపద పథకం, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వంద శాతం రాయితీతో మంగళవారం అంతర్గాం మండలం ఎల్లంపల్లి చెరువులో 10లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సముద్రంలో కలిసే నీటిని కాళేశ్వరం ఎత్తిపోతలతో బీడు భూములకు ఎదురెక్కించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, డీఎఫ్‌వో భాస్కర్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, సర్పంచులు ధరణి రాజేశ్, గుమ్ముల రవీందర్ బండారి ప్రవీణ్, కుర్ర వెంకటమ్మ నూకరాజు, తుంగపిండి సతీశ్, బాదరవేని స్వామి, మెరుగు పోశం, ధర్మాజీ కృష్ణ, ఎంపీటీసీ మస్కం శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు గౌస్‌పాషా, నాయకులు తిరుపతి నాయక్, కొల్లూరి సతీశ్, కోల సంతోష్‌గౌడ్, రాములు, ఎదులపూరం వెంకటేశ్, కొలిపాక మధూకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎలుక కొమురయ్య పాల్గొన్నారు.