కార్పొరేషన్, జూలై 22: నగర వ్యాప్తంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం టీఆర్ఎస్తో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలో అల్పాహారం వితరణ, అన్నదానం, రక్తదానం, పండ్లు పంపిణీ చేశారు. భగత్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో మేయర్ వై సునీల్‌రావు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు అంజన్‌రావు, వెంకట్రావు, ప్రకాశ్, హమీద్ తదితరులు పాల్గొన్నారు. టవర్‌సర్కిల్ వద్ద కార్పొరేటర్ వంగల శ్రీదేవి-పవన్‌కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, అల్పాహారం అందజేశారు. కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, నేతికుంట యాదయ్య, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మారెట్ రోడ్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, అల్పాహారం వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ పథకాన్ని తెచ్చిన ఘనత వినోద్‌కుమార్‌కే దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి జాతీయ రహదారులు, ఉర్దూ యూనివర్సిటీతో పాటు అనేక పథకాలను మంజూరు చేయించారన్నారు. కరీంనగర్ జిల్లా అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారి వేణు, వాల రమణారావు, నేతికుంట యాదయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, నాయకులు వొడ్నాల రాజు, ఆరె రవిగౌడ్, నారదాసు వసంత్ రావు, పటేల్ శ్రవణ్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, చుక శ్రీనివాస్, బొంకూరి మోహన్, చొకారపు చంద్రం, వడ్లకొండ పరశురాం, శనిగరపు సతీశ్, రమేశ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కార్ఖానగడ్డలోని వృద్ధాశ్రమంలో కార్పొరేటర్ గంట కల్యాణి-శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేయర్ వై సునీల్‌రావు చేతుల మీదుగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు కంకటి రాజారం, ఎగ్గడి జగన్, పులి సుమన్, కర్ర శ్రీహరి, మత్తి హరీశ్, భాస్కర్, దిలీప్ పాల్గొన్నారు.
63 కిలోల కేక్ ఏర్పాటు
తెలంగాణచౌక్‌లో టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 63 కిలోల కేక్‌ను మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కట్ చేశారు. మొక్కలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో వినోద్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, ఆరె రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే, నగరంలోని వినోద్‌కుమార్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, దూలం సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వారధి స్టడీ సరిల్ (కరీంనగర్) ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా, టీఆర్ఎస్ నాయకుడు భైరం పద్మయ్య విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం చెన్నాడి దవాఖానలో 50 మంది టీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు. మేయర్ వై సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, డాక్టర్ చెన్నాడి అమిత్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు మైకెల్ శ్రీను, వొల్లాల వాణి, శోభ, శ్రీనివాస్, ఓంకార్, ప్రభాకర్, బండ వేణు తదితరులు పాల్గొన్నారు. కార్ఖానాగడ్డలో టీఆర్ఎస్వీ నాయకులు దీకొండ కులదీప్వర్మ, వొడ్నాల రాజు ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్‌రావు చేతుల మీదుగా గొడుగులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్ మేచినేని వనజ-అశోక్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.
టీఆర్ఎస్ నాయకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హనుమాన్ ఆలయంలో టీఆర్ఎస్వీ నాయకుడు జక్కుల నాగరాజు, గందె కల్పన ఆధ్వర్యంలో పూజలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు సాయికృష్ణ, సంపత్‌గౌడ్, వొల్లాల వాణి, ఎలిగేటి మురళి, గంటల రేణుక, రుద్ర రాధ, మేకల రజినీ, రొడ్డవేణి తిరుపతి, ఓంకార్, ప్రభాకర్, బండ వేణు, ప్రదీప్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలు, గర్భిణులకు టీఆర్ఎస్ మహిళా నాయకులు గందె కల్పన, కర్రె పావని పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆరెపల్లిలోని దర్గాలో టీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ నయీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొకలు నాటారు. టీఆర్ఎస్ నాయకులు ఎండీ అజీమ్, ఆరీఫ్, ఖాదీర్, ఇమ్రాన్, తగదీర్ ఇలియాస్, వహీద్, ఉమర్ అక్బర్ సయీద్, హాజీ పాషా, ఇస్మాయిల్, ఇమామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కరీముల్లా షా దర్గాలో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసి, అన్నదానం చేశారు. సులేమాన్ తవకలీ, మజీద్, అస్మత్ అలీ బేగ్, షేక్ నబీ, సయ్యద్ సాజిద్, కదీర్ షా ఖాన్, బాబా, ఇర్ఫాన్ ఉల్ హఖ్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మారెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, గుర్రం అశోక్‌గౌడ్, ఠాగూర్ సాయిసింగ్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలో కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణాగౌడ్, ఎదుర్ల రాజశేఖర్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కిసాన్‌నగర్‌లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో కంసాల శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, యువసేన అధ్యక్షుడు సంపతి అశోక్, ప్రధాన కార్యదర్శులు గడ్డం వీరేందర్, దరిపెల్లి క్రాంతి, దొమ్మటి శంకర్, మద్దెల రాజేందర్, గసికంటి అరుణ్, మారుముళ్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ, ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో టీఆర్ఎస్వీ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్వీ నాయకులు రాజు, అనిల్, క్రాంతి, అరవింద్ పాల్గొన్నారు.
వినోద్‌కుమార్‌ను కలిసిన గిరిజన నేతలు
కొత్తపల్లి, జూలై 22 : హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో బీ వినోద్‌కుమార్‌ను టీఆర్ఎస్కేవీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ రూప్సింగ్, చింతకుంట ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్, గిరిజన సంఘం నాయకులు తిరుపతినాయక్, రాజు నాయక్, అనిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.