కార్పొరేషన్, మార్చి 7: మహిళల ఆర్థికాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని 31, 9వ డివిజన్లలో సోమవారం మహిళలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలతో పాటు పారిశుధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను సన్మానించారు. కార్పొరేటర్లు లెక్కల స్వప్న-వేణు, ఐలేందర్ యాదవ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, మార్చి 7: రాష్ట్ర ప్రభుత్వం షాదీముబారక్ ద్వారా ఇచ్చిన ప్రోత్సాహకంతో మాబిడ్డ పెండ్లి చేసినం… అలాగే, కేసీఆర్ కిట్ ఇచ్చి ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని మహ్మద్ బషీర్, జైతూన్ కుటుంబం తెలిపింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండో రోజూ ప్రభుత్వ లబ్ధిదారుల వద్దకు వెళ్లే కార్యక్రమంలో భాగంగా మేయర్ వై సునీల్‌రావు 33వ డివిజన్లో పర్యటించారు. ఆయన పలువురు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తాము ఎప్పటికీ సీఎం కేసీఆర్‌ను గుర్తు పెట్టుకుంటామని తెలిపారు.
33వ డివిజన్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళలు పాలాభిషేకం చేశారు. మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, మార్చి 7: నగరంలోని 42వ డివిజన్లో కార్పొరేటర్ వనజ- అశోక్‌రావు ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులు, ఆర్పీలు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులను సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు. ్ల గంటల రేణుక, రవి, రామచందర్, కిరణ్, మొగిలి శ్రీనివాస్, మొబిన్, పవన్‌రావు పాల్గొన్నారు.
కార్పొరేషన్, మార్చి 7: 37వ డివిజన్లో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లబ్ధిదారుల ఇంటికి డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ వెళ్లి మాట్లాడారు. లబ్ధిదారులతో సెల్ఫీ దిగారు. టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, మార్చి 7: 8వ డివిజన్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలను కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్ సత్కరించి, చీరెలు పంపిణీ చేశారు. కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, పురంశెట్టి అనోహర్, దాసం కమలాకర్, సిరిసిల్ల అంజయ్య, సల్ల మహేందర్, ఓదెలు, రాజయ్య, కొమురయ్య పాల్గొన్నారు.
కొత్తపల్లి, మార్చి 7: మల్కాపూర్ గ్రామంలో పారిశుధ్య కార్మికురాలు, మహిళా వార్డు సభ్యులను ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ సత్కరించారు. సర్పంచ్ గొట్టె జ్యోతి-పోచయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, పండుగ గంగవ్వ, గణేశ్ పాల్గొన్నారు.