మహబూబ్నగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్నగర్ ( Mahabubnagar ) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ఆంక్షలు ( Traffic restrictions ) విధించింది. ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఎం సమావేశానికి సంబంధించిన వాహనాలు తప్ప, సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
పిస్తా హౌస్ బైపాస్ – రాయచూర్ రోడ్డు, భూత్పూర్- మహబూబ్నగర్ టౌన్ మార్గం, పీయూ కాలేజ్ కొత్త బైపాస్ నుంచి పిస్తా హౌస్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. కర్నూల్ నుంచి మహబూబ్నగర్ వచ్చే వాహనాలు ఎన్హెచ్ 44 తాటికొండ మీదుగా మహబూబ్నగర్ టౌన్లోకి ప్రవేశించవచ్చని సూచించారు.
జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు ఎస్వీఎస్ హాస్పిటల్ ముందు నుంచి ఆర్టీసీ బస్టాండ్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా రాయచూర్ రోడ్డు చేరుకోవచ్చన్నారు. నాగర్కర్నూల్ నుంచి మహబూబ్నగర్ టౌన్లోకి వచ్చే వాహనాలు భూత్పూర్ ఫ్లైఓవర్ క్రింది భాగంలో లెఫ్ట్ తీసుకొని, తాటికొండ మీదుగా మహబూబ్నగర్ టౌన్లోకి రావచ్చని వెల్లడించారు. ప్రజలు ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలను పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.