CP Ghouse Alam | తిమ్మాపూర్, జూన్ 27 : తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
రికార్డులు పరిశీలించి నేరాల సంఖ్య తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. మామిడి మొక్క నాటి నీరు పోశారు. ఆయనతోపాటు ఏసీపీ విజయ్ కుమార్, సీఐ బొల్లం రమేష్, ఎస్సై అన్వర్, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.