e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home కరీంనగర్ ముస్లింలకు రంజాన్‌ దుస్తుల పంపిణీ

ముస్లింలకు రంజాన్‌ దుస్తుల పంపిణీ

ముస్లింలకు రంజాన్‌ దుస్తుల పంపిణీ

చొప్పదండి, మే12: మండలంలోని రుక్మాపూర్‌లో రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ముస్లింలకు అందజేస్తున్న దుస్తులను ఎంపీపీ చిలుక రవీందర్‌ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. షాదీముబారక్‌ పథకాన్ని అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. మైనార్టీ వి ద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అన్ని మతాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు ఖాజామీయా, దస్తగిరి, కారోబార్‌ సలీం, దులొద్దీన్‌, షకీర్‌, చాంద్‌పాషా పాల్గొన్నారు.

అనాథలకు రంజాన్‌ కిట్‌ అందజేత..
గంగాధర, మే 12: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు అనాథ పిల్లలకు రంజాన్‌ కిట్‌ను గురువారం గంగాధరలో అందజేసినట్లు గంగాధర మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్‌ వారుణి తెలిపారు. కిట్టులో 10 కిలోల చొప్పున బియ్యం, గోధుమ పిండి, 2 కిలోల చొప్పున నూనె, పప్పు, సేమియా, 200 గ్రాముల మిర్చి పౌడర్‌ ఉన్నట్లు వెల్లడించారు. రంజాన్‌ కిట్టును అందజేసిన ప్రిన్సిపాల్‌కు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐ ఆర్థిక సాయం
రామడుగు, మే12: మండల కేంద్రానికి చెంది న ఎన్నారై తోట సత్యం సహకారంతో రంజాన్‌ పం డుగను పురస్కరించుకొని బుధవారం 25 నిరుపేద ముస్లిం కుటుంబాలకు సర్పంచ్‌ పంజాల ప్ర మీల నగదును అందజేశారు. అమెరికాలో స్థిర పడ్డ సత్యం రంజాన్‌ పండుగ సందర్భంగా స్థానిక మసీద్‌లో 25 ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 1500 చొప్పన సర్పంచ్‌ చేతుల మీదుగా అందించారు. ఇక్కడ మాజీ సర్పంచ్‌ పంజాల జగన్‌మోహన్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముస్లింలకు రంజాన్‌ దుస్తుల పంపిణీ

ట్రెండింగ్‌

Advertisement