Veernapally | వీర్నపల్లి, ఫిబ్రవరి 8 : అప్పుల బాధతో ఓ యువకుడు దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వీర్నపల్లి మండలం కంచర్లలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన వరికొప్పుల రాకేష్ (24) సంవత్సరం కిందట ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీరకపోవడంతో మన స్థాపన చెందిన రాకేష్ శనివారం అర్ధరాత్రి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
తోటి మిత్రులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా చొరవ తీసుకోవాలని సర్పంచ్ సామల్ల దేవరాజు, స్థానిక నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.