జగిత్యాల, అక్టోబర్ 4: కొండా సురేఖ మహిళా మంత్రి అయి ఉండి తోటి మహిళను కించపర్చేలా మా ట్లాడడం ఏమాత్రం సరికాదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హితవుపలికారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ నటిని కించపరిచేలా మహిళా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
అనంతరం మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇష్టారీతిన విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ చేయాలని రైతులు ప్రతిరోజూ ధర్నాలు చేస్తుంటే.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయిన్పటికీ.. హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టడం తప్పా చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎకడ చూడలేదన్నారు.
విష జ్వరాలతో ప్రజలు విలవిలలాడుతున్న మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి కాంగ్రెస్ శ్రేణులు పోటీ పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ఆనంద్‌రావు, వొల్లెం మల్లేశం, సమిండ్ల శ్రీనివాస్, శీలం ప్రవీణ్, దామోదర్ రావు, అమీన్, రిజ్వాన్, గంగాధర్, గంగారెడ్డి, నక గంగాధర్, గాజుల శ్రీనివాస్, భగవాన్, ప్రతాప్ పాల్గొన్నారు.