Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 19 : చిగురుమామిడి మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్‌గా పీ కళావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన స్వరూపారాణి తహసీల్దార్ గా పదోన్నతి పై వెళ్లడంతో రెండు నెలలుగా డిప్యూటీ తహసీల్దార్ లేకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ కళావతి గంగాధర రెవెన్యూ కార్యాలయం నుండి బదిలీపై వచ్చారు.
వీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కరీంనగర్ డీఆర్డీఏలో విధులు నిర్వహించారు. మండలంలోని ప్రజలు వివిధ సమస్యలపై నేరుగా కార్యాలయానికి రావాలని, పనులు చేయిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దని డిప్యూటీ తహసీల్దార్ మండల ప్రజలను కోరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయంలోని రెవెన్యూ సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు.