Kalasha Yatra | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 17: రేజాంగ్ల ప్రాంతంలో 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన వీరుల కోసమే ‘రేజాంగ్ల రజ్ కలశ యాత్ర’ను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పేర్కొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం చేపట్టిన ‘రేజాంగ్ల రజ్ ‘కలశయాత్ర’ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చేరుకుంది. తంగళ్లపల్లిలో యాత్రకు ఘనస్వాగతం పలికారు. యాత్ర కలశాన్ని
యాదవ అఖిల భారత యాదవ మహాసభ నాయకులు స్వీకరించారు.
అనతరం బైక్ ర్యాలీతో సిరిసిల్ల మీదుగా వేములవాడకు పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చైనా- ఇండియా యుద్ధంలో 1300 మందిని హతమార్చి, 120 మంది యాదవ యుద్ధ వీరులు వీర మరణం పొందారన్నారు. వీరులకు గుర్తింపుగా ‘యాదవ రేజిమెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. యాదవ రేజిమెంట్ కోసం రాజాంగ్ల రజ్ కలశ యాత్ర చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్, నవీన్ యాదవ్, ఆసరి బాలరాజు, మీరాల శ్రీనివాసయాదవ్, గోగు మల్లేశం యాదవ్, జంగం శ్రీనివాస్, నూనే హరిష్, వెల్పుల సాయి, ప్రసాద్ యాదవ్, కావటి మల్లేశం, జంగం సత్తయ్య, బోగి శ్రీనివాస్, నక్క సతీష్, సురేష్ బండ అంజయ్య, నాయకులు పాల్గొన్నారు.