కమాన్ చౌరస్తా, మార్చ్ 4 : విద్యార్థులు మేధస్సుకు పదను పెట్టి అద్భుతమైన ప్రదర్శనలు చేశారని, భవిష్యత్‌లో భావి శాస్త్రజ్ఞులుగా చిన్నారులు ఎదుగాలని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో మంగళవారం సైన్స్ ఫేర్ ను(Science Fair) నిర్వహించారు. ముందుగా అనంతరెడ్డి సీవీ రామన్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీవీ రామన్ చేసి రామన్ ఎఫెక్ట్ ను విద్యార్థులకు వివరించారు.
సైన్స్ నిత్య జీవితంలో ఒక భాగమన్నారు. సైన్స్ లేనిదే ఏదీ లేదని ప్రతి ఒక్కటి సైన్స్‌తో ముడిప డిఉందన్నారు. ద్యార్థి దశలోనే సైన్స్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. అబ్దుల్ కలాం లాంటి మిస్సైల్ మ్యాన్లను ఆదర్శంగా తీసుకొని సైన్స్ లో రాణించాలన్నారు. పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు 200కు పైగా ప్రదర్శనలు చేయడం అభినందనీయమని ఈ సందర్బంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.