వేములవాడ, మే 31: క్రీడా నైపుణ్యాలు మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ఈ నెల 5 నుంచి7వర కు జరిగే ఇంటర్నేనల్ మాస్టర్ అథ్లెటిక్స్‌కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయన శుక్రవారం అభినందించా రు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు.
ఆధునిక ప్రపంచంలో యువత సామాజిక మాధ్యమాల వైపు ఆకర్షితులై కనీస వ్యాయామానికి కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా స్టర్ అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడల్లో పాలుపంచుకోవడం అభినందనీయమని వారిని ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ కార్యదర్శి జీ శేఖర్, జాయింట్ సెక్రటరీ చింతలపల్లి మునీందర్‌రెడ్డి, పెద్దపల్లి కార్యదర్శి కే మహేందర్‌రెడ్డి, అథ్లెట్స్ కమఠం రామానుజమ్మ, నాయిని శంకర్, అబ్దుల్ పఠాన్, లక్ష్మణ్, కమల్, జవ్వాజి లక్ష్మణ్, మేనేజర్ గడ్డం సత్యనారాయణరెడ్డి, నాయకులు కనికరపు రాకేశ్, అన్నారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ రూరల్, మే 31: వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో లయ యూత్ క్లబ్ 30వ వార్షికోత్సవం సం దర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. అనంత రం మరణించిన క్రీడాకారుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఇక్కడ జిల్లా వాలీబార్ అసోసియన్ కార్యదర్శి శ్రీకుమార్, మాజీ సర్పంచ్ జైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు గొస్కుల రవి, నాయకులు బాల్‌రెడ్డి, తిరుపతి, మల్లారెడ్డి, సంఘ స్వా మి, ముకుందరెడ్డి, మల్లేశం, అనిల్, శ్రీనివా స్, లయ యూత్ క్లబ్ సభ్యులు ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, మే 31: తరతరాల నుంచి కుల వృత్తిని గ్రామస్తుల నమ్మకాలు, విశ్వాసాల మేరు చేస్తున్నామని తమను వృత్తిదారులుగా గుర్తించాలని బైండ్ల సంఘం నాయకులు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. శుక్రవారం వెంకటాపూర్ నేతలు మండల కేంద్రంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. పూ జల పేరిట దోపిడీ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, నమ్మకంతో వచ్చే భక్తులకు లాభాపేక్ష లేకుండా సేవచేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాం గ్రెస్ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.