దళిత బంధుతో సత్ఫలితాలు
దళిత బంధు పథకం ద్వారా దళిత మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలను చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని, దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు
- వినూత్న వ్యాపారాల్లో లబ్ధిదారులు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్
- జ్యూట్ బ్యాగ్ తయారీ కేంద్రం సందర్శన
- పలు కార్యక్రమాలకు హాజరు
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 3: దళిత బంధు పథకం ద్వారా దళిత మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలను చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని, దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు కింద ఐదుగురు కలిసి ఏర్పాటు చేసుకున్న జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ బుధవారం సందర్శించారు.
స్వచ్ఛ హుజూరాబాద్‌లో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 15వ వార్డు కౌన్సిలర్ కల్లెపల్లి రమాదేవి తన సొంత డబ్బులతో ఆ కేంద్రంలో తయారు చేయించిన జ్యూట్ బ్యాగులను వినోద్‌కుమార్ ఆవిషరించారు. ప్రతి ఒకరూ ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, బట్ట సంచులు కవర్ సంచులకు బదులు వాడాలని సూచించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ చింత శ్రీనివాస్ గౌడ్ కుమార్తె సుప్రితను పెళ్లి కుమార్తెగా తయారు చేయగా ఆయన అకడికి వెళ్లి ఆ యువతిని ఆశీర్వదించారు. అనంతరం చెల్పూర్ మీదుగా జమ్మికుంటకు ఓ వివాహానికి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, మారపెల్లి సుశీల, కమిషనర్ చీమ వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

