Journalists | పెద్దపల్లి/ పెద్దపల్లిరూరల్ మే 28: తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పనిచేసిన పలువురు జర్నలిస్టులను పెద్దపల్లి జిల్లా ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో బుధవారం జరిగిన ఉద్యమ కారుల సన్మాన సభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు డాక్టర్ చీమ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉదద్యమకారులతో కలిసి పనిచేసిన విలేకరులు పెద్దపల్లి టీ న్యూస్ రిపోర్టర్ కత్తెర్ల తిరుపతి యాదవ్, సిటీ న్యూస్ (సీనియర్) వీడియో జర్నలిస్ట్ తిర్రి సుధాకర్ గౌడ్ లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. విలేకరులను సన్మానించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.