Journalists | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 24 : కాశ్మీర్లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి క్యాండిల్ లో వెలిగించి మౌనం పాటించారు.
పహల్గాం ఘటనను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే కాల్వ రామచంద్రారెడ్డి గృహం వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టి ఈ సందర్భంగా ఉగ్ర దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉగ్రదాడులకు పాల్పడడం అభివృద్ధికి తిలోదకంగా మారుతుందని వారు పేర్కొన్నారు. అమరులైన మృతుల కుటుంబాలు తమ సంతాపాన్ని తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యాపారులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సోన్నాయిటెంకం చంద్రమౌళి, రావి కోటేశ్వర్, సిద్ధం సదానందం, బాలే శివ ప్రసాద్, మేకల మల్లేశ్, శ్రీమంతుల కొండాల్, అనంతరెడ్డి, గాదర్ల వెంకట్ రాజం, మెట్టు మధూకర్, దుర్గం మల్లేష్, జీలుకర రమేష్, ముస్కు అశోక్, రామగల్ల సురేష్, వడ్లూరి రాజేశ్వరరావు, ఒడ్నల అజయ్, బెజ్జాల ప్రభాకర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.