Jayashankar Sir | ఓదెల, జూన్ 21 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 15వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ ఫొటోకు ఉద్యమకారులు శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసి ప్రపంచ దేశాలకు తెలంగాణ నినాదాన్ని వినిపించారన్నారు. 60 ఏండ్ల ఆకాంక్షకు ప్రతిరూపంగా అనుక్షణం తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, తెలంగాణ భావజాల వ్యాప్తిని నలుదిశలా వ్యాపింపజేసిన తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సర్ అని కొనియాడారు.
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి తెలంగాణ ప్రజలను జాగృతపరచి, రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన గొప్ప మేధావి జయశంకర్ సార్ అని అన్నారు. జయశంకర్ సార్ ఆశయాలతోనే ముందుకు సాగుతామని వారి ఫొటోకు పూలమాలలు వేసి ఉద్యమకారులు అందరు కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, చర్లపల్లి సురేష్ గౌడ్, పలకల నరసింహారెడ్డి, పలకల కరుణాకర్ రెడ్డి, పలుగువెల్లి రవీందర్ రెడ్డి, నూతి తదితరులు పాల్గొన్నారు.