Manthani | మంథని, డిసెంబర్ 31: మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా జంజర్ల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని డివిజన్ ఎలాక్ట్రానిక్ మీడియా 12 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడిగా జంజర్ల శంకర్, ఉపాధ్యక్షుడిగా ఎండీ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా మాచిడి
కిరణ్ గౌడ్, కార్యదర్శిగా బండ లక్ష్మీ నారాయణ, కోశాధికారిగా మాచిడి రాజేంద్ర ప్రసాద్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా మూగ శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఎం శివ ప్రసాద్, చిట్లిమెల్ల సంతోష్, రావికంటి సతీష్ కూమార్ ఎన్నికయ్యారు. అదేవిధంగా గౌరవ అధ్యక్షుడిగా మేడగోని గోపాల్ గౌడ్, గౌరవ సలహాదారులుగా పినగాని శ్రావణ్ కుమార్, మేడగోని సత్యనారాయణ గౌడ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు జర్నలిస్ట్ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. మంథని డివిజన్లో మీడియా ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం హామీ ఇచ్చింది.