Appointed | పెద్దపల్లి రూరల్ మే10: పెద్దపల్లి మడల ఇంచార్జి మండల పంచాయతీ అధికారిగా మండలంలొని నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జనగామ శరత్ బాబు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ హాజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో సెలవుపై వెళ్తున్నారు. దీంతో మండల అభివృద్దిని పర్యవేక్షించేందుకుగాను ఆయన స్థానంలో నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి శరత్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, అట్టి ఆదేశాలతో జాన్ 30 వరకు ఇంచార్జి ఎంపీవోగా శరత్ బాబు బాధ్యతలు నిర్వహిస్థారని ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ తెలిపారు.