leadership qualities | పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 19 : ఎన్ఎస్ఎస్ శిబిరాల నిర్వహణతో వాలంటీర్లుగా పాల్గొంటున్న వారంతా చదువుతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకుంటూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటలో ప్రభుత్వ బాలుర కళాశాల, గౌరెడ్డిపేటలో ప్రభుత్వ బాలికల కళాశాల ఆద్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో ఎంపీడీవో, ఎంపీవోలు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరాలతో విద్యార్దుల్లో సేవా భావం పెరుగుతుందని, తద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే సేవతో కూడిన నాయకులుగా పంచాయతీ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ, ఉపాధ్యాయులు భారతి, కోటేశ్వర్ రావు, పంచాయతీ కార్యదర్శిలు అశోక్, తిరుపతి, జీపీవో అంజలి, ప్రోగ్రామ్ ఆఫీసర్ నరహరి, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ సదయ్య , శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, సుధీర్, నాయకులు తిరుపతిరావు, శ్రీనివాస్ గౌడ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.