జగిత్యాల : జగిత్యాల పట్టణంలో హనుమాన్ వాడలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
దీంతో పోలీసులు అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని పరిశీలించి అనుమానితులను విచారించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అంబేద్కర్ విగ్రహాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. తక్షణమే స్పందించి పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.